Mon Dec 23 2024 04:11:52 GMT+0000 (Coordinated Universal Time)
వారికి ఏపీ సర్కార్ పదికోట్ల చెల్లింపు
కోవిడ్ తో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పది కోట్లను విడుదల చేసింది
కోవిడ్ తో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పది కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్ తో మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం యాభై వేల చొప్పున ఎక్స్గ్రేషియో చెల్లించింది. గతంలో అనేక మందికి చెల్లించినా ఇంకా అనేక మంది మిగిలిపోయారని వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో పది కోట్లను విడుదల చేసింది.
మిగిలిపోయిన...
పరిహారం అందకుండా మిగిలిపోయిన కుటుంబాలకు తక్షణమే చెల్లించాలని రెవెన్యూ శాఖ ఆదేశాలను జారీ చేసింది. పరిహారం చెల్లించిన అనంతరం ఆ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సిందిగా అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు త్వరలోనే వారికి పరిహారం చెల్లించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
Next Story