Sun Mar 30 2025 09:36:17 GMT+0000 (Coordinated Universal Time)
Kolikapudi : రేపు తిరువూరులో కొలికపూడి ర్యాలీ లేనట్లే
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం ఫోన్ చేసింది

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం ఫోన్ చేసింది. తిరువూరులో ఎలాంటి ర్యాలీలు చేపట్టవద్దని ఆయనను కోరింది. ర్యాలీలతో శాంతిభద్రతలకు భంగం వాటిల్లే అవకాశముందని చెప్పడంతో కొలికపూడి శ్రీనివాసరావు కూడా ర్యాలీని విరమించుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆయనకు ఫోన్ చేసి ర్యాలీ చేయవద్దని కోరినట్లు తెలిసింది.
అధినాయకత్వం సూచన మేరకు...
నిజానికి కొలికపూడి శ్రీనివాసరావు రేపు తిరువూరు నియోజకవర్గంలో తన మద్దతుదారులతో కలసి ర్యాలీని నిర్వహించాలని నిర్ణయించారు. తనపై పెద్దయెత్తున కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే కొలికపూడిపై ఇటు టీడీపీ నేతలు, అటు మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ అధినాయకత్వం నుంచి ఫోన్ రావడంతో ర్యాలీ ఆలోచనను విరమించుకున్నారు.
Next Story