Mon Dec 23 2024 06:36:34 GMT+0000 (Coordinated Universal Time)
బీచ్లో చెప్పులు మోయించిన రోజా
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మరోసారి విపక్షాల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు. సూర్యలంక బీచ్ లో పర్యటిస్తున్న ఆర్కే రోజా వివాదానికి కారణమయ్యారు. బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ కు వెళ్లిన పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అక్కడ తిరిగేందుకు చెప్పుులు విడిచారు. అయితే చెప్పుులు ఎవరైనా ఎత్తుకెళతారేమోనని భావించిన రోజా అక్కడ ఉన్న సిబ్బందిని తన చెప్పులు తీసుకు రావాలని ఆదేశించారు.
వైరల్ గా మారిన ఫొటోలు...
దీంతో అక్కడ పనిచేస్తున్న టూరిజం శాఖ హౌస్ కీపింగ్ ఉద్యోగి ఒకరు రోజా చెప్పులను మోశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రోజా బీచ్ లో తిరుగుతున్నంత సేపూ హౌస్ కీపింగ్ ఉద్యోగి మంత్రి చెప్పులను చేతితో పట్టుకుని ఆమె వెంట తిరుగుతూనే ఉన్నాడు. దీనిపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. బీచ్ లో సరదాగా గడిపేందుకు వచ్చిన రోజా ఇలా చేయడం తప్పు అని, తన చెప్పులను ఉద్యోగి చేతిలో పెట్టడం ఎంతవరకూ కరెక్ట్ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆమె టూరిజం ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story