Sat Nov 23 2024 05:36:10 GMT+0000 (Coordinated Universal Time)
కర్నూలు జిల్లాలో హనుమాన్ శోభాయాత్రపై రాళ్ల దాడి
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రాళ్ల దాడిలో 15 మంది
కర్నూల్ : దేశంలోని పలు ప్రాంతాల్లో హనుమాన్ శోభాయాత్రల సమయంలో రాళ్ల దాడి ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే..! అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. హనుమాన్ జయంతి సందర్భంగా కర్నూలు జిల్లాలోని ఆలూరు హోళగుంద, ఈర్లకట్టలో నిర్వహించిన శోభాయాత్రపై కొందరు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో స్థానికులు గాయపడ్డారు. వారిలో ఓ బాలిక కూడా ఉంది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రాళ్ల దాడిలో 15 మందికి స్వల్ప గాయాలైనట్లు పోలీసులు చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో ఆధారంగా ఈ ఘటనకు కారణమైనట్లుగా అనుమానిస్తోన్న 20 మందిని అదుపులోకి తీసుకున్నామని, వారిని విచారిస్తున్నట్లు కర్నూలు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వెల్లడించారు.
ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ఆ ప్రాంతానికి చేరుకొని.. అక్కడే ఉన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం జరిగిన శోభాయాత్రలో ఇరువర్గాల మధ్య ఘర్షణపై ఎస్పీ ఆరా తీశారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story