Thu Apr 03 2025 00:05:19 GMT+0000 (Coordinated Universal Time)
ఐక్యరాజ్యసమితిలో ఏపీ విద్యార్థులు
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అరుదైన అవకాశం లభించింది. ఐక్యరాజ్యసమితిలో జరిగే కార్యక్రమంలో ఏపీ విద్యార్థులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అరుదైన అవకాశం లభించింది. ఐక్యరాజ్యసమితిలో జరిగే కార్యక్రమంలో ఏపీ విద్యార్థులు పాల్గొననున్నారు. రెండు వారాల పాటు ఏపీ విద్యార్థుల బృందం అమెరికాలో పర్యటించనుంది. ఈ విద్యార్థి బృందం అమెరికాలోని వరల్డ్ బ్యాక్, కొలంబియా యూనివర్సిటీ, వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ ను వీరు సందర్శించనున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఈ విద్యార్థులకు అరుదైన అవకాశం తొలిసారి లభించింది. దీంతో పాటు ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించనున్నారు. సస్టైనబుల్ డెవలెప్మెంట్ గోల్ గురించి మాట్లాడనున్నారు. ఈ నెల15వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ అమెరికాలో ఈ బృందం పర్యటించనుంది.
అమెరికాలో పర్యటన...
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలోని విద్యారంగంలో అనేక సంస్కరణలను తెచ్చింది. ఇందులో ప్రధానమైదని నాడు - నేడు పథకం ద్వారా స్కూళ్ల రూపు రేఖలనే మార్చేశారు. అమ్మవొడి పథకం ద్వారా విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచారు. జగనన్న విద్యాకానుక, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన వంటి పథకాల ద్వారా పేద విద్యార్థులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ఈ సంస్కరణలకు సంబంధించి కూడా ఐక్యరాజ్యసమితిలో జరిగే సదస్సులో ప్రదర్శించనున్నారు.
అరుదైన అవకాశం...
దీంతో పాటు జగన్ ప్రభుత్వం విద్యార్థులకు టాబ్లెట్లు అందించి వారికి మెరుగైన విద్యావిధానాన్ని అందించడాన్ని కూడా వివరించనున్నారు. నాణ్యమైన విద్యను అందించి పేదరికాన్ని దూరం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ విద్యారంగంలో తీసుకు వచ్చిన మార్పులను వారు ఐక్యరాజ్యసమితిలో తెలపనున్నారు. అమెరికాలో వెళ్లిన వారంతా పేద విద్యార్థులే కావడం గమనార్హం. ప్రపంచ వేదికలో తొలిసారి ఏపీ ప్రభుత్వ పాఠశాలలు ప్రసగించడం, అమెరికాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. వారిలో ఆత్మవిశ్వాసం మరింత నింపుతుందని ప్రభుత్వ ం కూడా భావిస్తుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.
Next Story