Mon Dec 23 2024 18:46:12 GMT+0000 (Coordinated Universal Time)
పేర్ని నానిపై క్లంప్లయింట్.. ఉద్యోగులను బెదిరిస్తున్నారంటూ
పేర్ని నానిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మీనాకు, డీజీపీకి పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ ఫిర్యాదు చేశారు
మాజీ మంత్రి పేర్ని నానిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎంకే మీనాకు, డీజీపీకి ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ ఫిర్యాదు చేశారు. కౌంటింగ్ అంశంపై ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేసేలా మాజీ మంత్రి పేర్ని నాని మీడియాను ఉద్దేశించి మాట్లాడారన్నారు. కౌంటింగ్లో పాల్గొని ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులను బెదిరిస్తున్నారన్నారు.
ఎన్నికల సంఘానికి...
దీనిపై ఎన్నికల సంఘం దృష్టి సారించి ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సుబ్బరాయన్ విజ్ఞప్తి చేశారు. పేర్ని నాని ఉద్యోగులను బెదిరిస్తూ ముందుంది ముసళ్ల పండగ అంటూ వారిని బ్లాక్ మెయిల్ చేసేలా వ్యవహరించారని, ఇది ఖచ్చితంగా కౌంటింగ్ లో పాల్గొనే అధికారులను బెదిరించడమేనని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Next Story