Fri Dec 27 2024 18:42:32 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : మరో వైసీపీ కీలక నేత జంప్
అధికారం కోల్పోవడతంతో వరసగా నేతలు వైసీపీని వీడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరనున్నారు
అధికారం కోల్పోవడతంతో వరసగా నేతలు వైసీపీని వీడుతున్నారు. జగన్ కు అత్యంత ముఖ్యమైన, సన్నిహితులు కూడా పార్టీని వీడి వెళుతున్నారు. నిన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి రాజీనామా చేసిన విషయం మరవక ముందే మరో కీలక నేత కూడా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు.
జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే...
ఆయనే జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను. సామినేని ఉదయభాను ఈ నెల 22వ తేదీన జనసేనలో చేరే అవకాశాలున్నాయి. ఈ మేరకు జనసేన అగ్రనేతలతో మాట్లాడినట్లు తెలిసింది. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో త్వరలోనే సామినేని ఉదయభాను పార్టీకి రాజీనామా చేస్తారని సమాచారం. కాపు సామాజికవర్గానికి చెందిన ఉదయ భాను పార్టీని వీడుతుండటంతో కృష్ణా జిల్లాలో వైసీపీకి ఊహించని షాక్ అని చెప్పాలి. ఈ నెల 22వ తేదీన పవన్ సమక్షంలో సామినేని ఉదయభాను, బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలో చేరతారని తెలిసింది.
Next Story