Sun Mar 30 2025 07:14:36 GMT+0000 (Coordinated Universal Time)
అవసరమైతే తప్ప బయటకు రాకండి
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ రెండు రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతవరణ శాఖ తెలిపింది

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ రెండు రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతవరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో అయితే వడగాల్పులు, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు కూడా ఏపీలో 125 మండలాల్లో వడగాల్పు ప్రభావం ఉంటుందని తెలిపింది. రేపు కూడా వడగాలులు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
రెండు రోజులు ఎండలే...
ప్రజలు అప్రమత్తంగా లేకుంటే వడదెబ్బ తగిలే అవకాశముందని చెబుతున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. వచ్చినా తగిన జాగ్రత్తలు పాటించాలని, ఎండవేడిమి నుంచి తమను తాను కాపాడుకునే ప్రయత్నం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇపపటికే రెండు రాష్ట్రాల్లో అనేక చోట్ల నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అసాధారణ వేడితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బయటకు రావాలంటే భయపడిపోతున్నారు.
Next Story