Mon Dec 23 2024 09:04:40 GMT+0000 (Coordinated Universal Time)
స్పీకర్ కు సునీత లేఖ.. ఎంపీ అవినాష్ పై చర్యలు?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. తన తండ్రి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి హస్తం ఉందని ఆమె లేఖలో పేర్కొన్నారు. తన తండ్రి హత్య కేసులో పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డి పాత్రపై దర్యాప్తు చేయించాలని సునీత కోరారు.
సీబీఐ స్టేట్మెంట్స్ తో .....
లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు తాను రాసిన లేఖతో పాటు తాను సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా అందుకు జత చేశారు. తన తండ్రి హత్య కేసులో నిందితులు సీబీఐకి ఇచ్చిన స్టేట్ మెంట్ కాపీలను కూడా సునీత ఓంబిర్లాకు పంపిన లేఖకు జత చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని సునీత కోరారు.
- Tags
- ys sunitha
Next Story