Mon Dec 23 2024 06:08:55 GMT+0000 (Coordinated Universal Time)
రేపు శ్రీశైలానికి చీఫ్ జస్టిస్
ఈ నెల 25వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ శ్రీశైలంలో పర్యటించనున్నారు
ఈ నెల 25వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ శ్రీశైలంలో పర్యటించనున్నారు. శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వార్లను సీజఐ దర్శించుకోనున్నారు. ఈ నెల 25వ తేదీన శ్రీశైలానికి రానున్న సీజేఐ 26వ తేదీన ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు.
ప్రత్యేక పూజలు...
స్వామి వారికి రుద్రాభిషేకం, కుంకుమార్చనలు నిర్వహించనున్నారు. సీజేఐ రాక సందర్భంగా శ్రీశైలంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు కూడా భారీ బందోబస్తును నిర్వహిస్తున్నారు. సీజేఐకి స్వాగతం పలికేందుకు మంత్రులు శ్రీశైలానికి రానున్నారు.
Next Story