Mon Dec 23 2024 10:17:01 GMT+0000 (Coordinated Universal Time)
నేడు శ్రీశైలానికి చీఫ్ జస్టిస్
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేడు శ్రీశైలం రానున్నారు. కుటుంబ సమేతంగా స్వామివార్లను దర్శించుకోనున్నారు
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేడు శ్రీశైలం రానున్నారు. కుటుంబ సమేతంగా స్వామివార్లను దర్శించుకోనున్నారు. ఈరోజు సాయంత్రం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రమణ దంపతులు శ్రీశైలం చేరుకుంటారు. రాత్రికి అక్కడే వారు బస చేస్తారు. సోమవారం శివుడి దినం కావడంతో ఉదయాన్నే మల్లన్న స్వామిని చీఫ్ జస్టిస్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
ప్రత్యేక పూజలు....
రేపు కల్యాణోత్సవంలో కూడా ఎన్వీ రమణ దంపతులు పాల్గొంటారు. అనంతరం కంచిమఠంలో జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలోనూ పాల్గొంటారు. జస్టిస్ రమణ దంపతులు శ్రీశైలానికి వస్తుండటంతో అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈరోజు సాయంత్రం జస్టిస్ రమణ దంపతులు అమ్మావారిని ధూళి దర్శనం చేసుకోనున్నారు.
Next Story