Sun Dec 14 2025 18:16:29 GMT+0000 (Coordinated Universal Time)
జస్టిస్ రమణకు నేడు సన్మానం
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేడు విజయవాడలో పర్యటించనున్నారు.మూడు రోజుల నుంచి ఏపీలో పర్యటిస్తున్నారు

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ మూడు రోజుల నుంచి ఏపీలో పర్యటిస్తున్నారు. తొలి రోజు ఆయన స్వగ్రామం పొన్నవరం గ్రామాన్ని సందర్శించారు. అనంతరం గుంటూరు జిల్లాలో వివిధ కార్యక్రమాలలో జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు.
బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో....
నిన్న విజయవాడ దుర్గగుడిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైటీ కార్యక్రమానికి ఆయన కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఇక్కడ ముఖ్యమంత్రి జగన్ తో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు జస్టిస్ ఎన్వీరమణను కలుసుకున్నారు. ఈరోజు ఎన్వీ రమణ విజయవాడ బార్ అసోసియేషన్ నిర్వహించే సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈరోజు ఆయన తిరుగు ప్రయాణమవుతారు.
Next Story

