Mon Dec 15 2025 03:46:55 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ కు ఎదురుదెబ్బ
ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అంగళ్లు కేసులో హైకోర్టు తీర్పును సమర్థించింది.

ఆంధ్రప్రదేశ్ దాఖలు చేసిన వేర్వేరు పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అంగళ్లు కేసులో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. అంగళ్లు కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వడాన్ని అభ్యంతరం చెబుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆశ్రయించింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడమేంటని ప్రశ్నించింది.
హైకోర్టు తీర్పును...
టీడీపీ నేతలకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సమర్ధించింది. చిత్తూరు జిల్లాలోని అంగళ్లులో టీడీపీ కార్యకర్తలు చేసిన దాడిలో పోలీసులు గాయపడటంతో చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలపై కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసులో అరెస్టయిన నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Next Story

