Sun Dec 22 2024 01:38:29 GMT+0000 (Coordinated Universal Time)
వివేకాహత్య కేసులో "సుప్రీం" ఆదేశాలు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు సీబీఐకి కీలక ఆదేశాలు జారీ చేసింది
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు సీబీఐకి కీలక ఆదేశాలు జారీ చేసింది. హత్య కేసులో కుట్ర కోణాన్ని తర్వగా ఛేదించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 30వ తేదీలోగా దర్యాప్తు పూర్తి చేస్తామని సీబీఐ తెలిపింది. అదనపు ఛార్జిషీటు వేస్తామని కూడా తెలిపింది.
ఏప్రిల్ 10వ తేదీలోగా..
వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఏళ్లు గడుస్తున్నా దర్యాప్తు పూర్తి కాలేదు. హత్య జరగడానికి కారణాలు ఏంటో తెలియడం లేదు. ఇటీవల దర్యాప్తు అధికారిని మార్చాలని ఆదేశించిన సుప్రీంకోర్టు తాజాగా త్వరిత గతిన విచారణ పూర్తి చేసి కుట్రకోణాన్ని బయటపెట్టాలని ఆదేశించింది. దీంతో పాటు కొత్తగా సిట్ ను సుప్రీంకోర్టును ఏర్పాటు చేసింది. సీబీఐ డీఐజీ చౌరాసియా నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేసింది. సభ్యులుగా ఎస్పీ వికాస్ సింగ్, ఎస్పీ ముఖేష్ కుమార్లు సభ్యులుగా వ్యవహరిస్తారు. ఏప్రిల్ 30వ తేదీలోగా విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది.
Next Story