Mon Dec 23 2024 05:08:29 GMT+0000 (Coordinated Universal Time)
Breaking: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు
వైఎస్ వివేకా హత్యకేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వంతో పాటు సీబీఐకి కూడా నోటీసులు జారీ చేసింది. తన తండ్రి హత్య కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయడాలని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్గె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఏపీ సర్కార్ కు నోటీసులు...
దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వంతో పాటు, సీబీఐకి కూడా నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 14వ తేదీకి వాయిదా వేసింది. వైఎస్ వివేకా హత్య విషయంలో సీబీఐ దర్యాప్తు జరుపుతుంది. హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ చేపట్టింది. నిందితులను కూడా అరెస్ట్ చేసింది. అయితే దీనిపై దర్యాప్తు వేగవంతంగా జరగడం లేదని, ప్రధాన నిందితులను గుర్తించలేదని భావించిన సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Next Story