Mon Dec 23 2024 05:30:16 GMT+0000 (Coordinated Universal Time)
వివేకా హత్య కేసులో సుప్రీం కీలక నిర్ణయం
వైఎస్ వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేసును తెలంగాణ సీబీఐ కోర్టుకు బదిలీ చేసింది
వైఎస్ వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేసును తెలంగాణ సీీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత తన తండ్రి హత్య కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు.
తెలంగాణ కోర్టుకు బదిలీ...
ఈ పిటీషన్ ను విచారించిన సుప్రీంకోర్టు హతుడి కుటుంబ సభ్యులు విచారణపై అసంతృప్తిగా ఉన్నందున కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తున్నామని చెపపింది. ప్రాధమిక హక్కులను పరిగణనలోకి తీసుకున్నామని, న్యాయం జరుగుతుందని కాదని, జరిగినట్లు కనిపించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. హత్య కేసును ఇకపై తెలంగాణ సీబీఐ కోర్టు విచారిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది.
Next Story