Thu Dec 19 2024 19:17:20 GMT+0000 (Coordinated Universal Time)
నేడే జడ్జిమెంట్
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో క్వాష్ పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో తీర్పు వచ్చే అవకాశముంది
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో క్వాష్ పిటీషన్ నేడు కొట్టివేస్తారా? లేదా? చంద్రబాబుకు దసరా ముందు ఊరట లభిస్తుందా? ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. క్వాష్ పిటీషన్ పై వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. నేగు తీర్పు వెలువడే అవకాశముండటంతో అందరి దృష్టి సుప్రీంకోర్టు చెప్పబోయే తీర్పుపైనే ఉంది. 17ఎ పైనే వాదనలు పూర్తిగా నడవటంతో ఈ కేసులో వచ్చే తీర్పు దేశ వ్యాప్తంగా కూడా ఒక ఉదాహరణగా నిలిచే అవకాశముంది.
43రోజుల నుంచి...
చంద్రబాబు దాదాపు 43 రోజుల నుంచి జైలులో ఉన్నారు. ఆయన బయటకు రాావాలని టీడీపీలోని ప్రతి కార్యకర్త కోరుకుంటున్నాడు. ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో చంద్రబాబు వచ్చి జనంలో తిరగాలని భావిస్తున్నారు. అయితే క్వాష్ పిటీషన్ కొట్టివేస్తే ఎలా? అన్న ఉత్కంఠ కూడా నెలకొంది. చంద్రబాబుకు తీర్పు అనుకూలంగా రావాలని టీడీపీ శ్రేణులు ఆలయాలు, మసీదులు, చర్చిలలో ప్రార్థనలు జరుపుతున్నాయి. తమ అధినేత బయటకు రావాలని కోరుకుంటున్నాయి.
ఫైబర్ నెట్ కేసులో కూడా...
మరోవైపు ఫైబర్ నెట్ కేసులో కూడా చంద్రబాబు బెయిల్ పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది హైకోర్టు ఈకేసులో ముందస్తు బెయిల్ పై ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై కూడా నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అందుకే నేడు అందరూ ఢిల్లీ వైపు చూస్తున్నారు. ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇటు టీడీపీ మాత్రమే కాకుండా అధికార వైసీపీ నేతలు కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
Next Story