Sun Dec 22 2024 14:14:12 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ ఎంపీ అవినాష్ కు "సుప్రీం" నోటీసులు
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీంకర్టు నోటీసులు జారీ చేసింది
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీంకర్టు నోటీసులు జారీ చేసింది. ఇదే కేసులో శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డికి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
బెయిల్ రద్దు చేయాలంటూ...
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలంటూ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత వేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. అప్రూవర్ ను శివశంకర్ రెడ్డి కుమారుడు బెదిరించాడంటూ సునీత తరుపున న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలియజేశారు.
Next Story