Sun Jan 12 2025 12:08:01 GMT+0000 (Coordinated Universal Time)
జనవరి 17కి వాయిదా
ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్
ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 17కి వాయిదా వేసింది. కేసుకు సంబంధించి ఇటు చంద్రబాబు కానీ, అటువైపు ఏపీ ప్రభుత్వం కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని సూచించింది. చంద్రబాబు తరపున సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు రావాల్సి ఉంది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన భార్య నారా భువనేశ్వరితో కలిసి ఆయన తమిళనాడు కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూరుకు వెళ్తున్నారు. అక్కడ ఉన్న శ్రీరామానుజర్ ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి చంద్రబాబు ప్రత్యేక విమానంలో బయల్దేరి చెన్నైకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీపెరుంబుదూరుకు వెళ్తారు. దర్శనం అనంతరం చెన్నై చేరుకుంటారు. అనంతరం 8.50 గంటలకు విజయవాడకు విమానంలో బయల్దేరుతారు.
Next Story