Sun Jan 12 2025 07:57:47 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ సర్కార్ "'స్టే" వాదనకు సుప్రీం నో
అమరావతిపై హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కేసు విచారణ జులై 11వ తేదీకి వాయిదా వేసింది.
అమరావతిపై హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కేసు విచారణ జులై 11వ తేదీకి వాయిదా వేసింది. రాజధాని అమరావతి పిటీషన్లపై న్యాయమూర్తులు జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ బివి నాగరత్నలతో కూడిన ధర్మాసనం విచారించింది. త్వరిగతిన విచారణ చేపట్టడం సాధ్యం కాదని ధర్మాసనం చెప్పింది. ఈరోజు విచారణ సందర్భంగా హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని పదే పదే ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కోరినా ధర్మాసనం వారి వాదనలను పట్టించుకోలేదు. జులై 11న తొలి కేసుగా విచారణకు తీసుకుంటామని న్యాయమూర్తులు చెప్పి వాయిదా వేశారు.
మరో ధర్మాసనం ముందుకు...
మూడు రాజధానుల చట్టాలను ఉపసంహరించుకున్న తరువాత ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అర్ధం లేదన్న ఏపీ తరపు సీనియర్ కౌన్సిల్ కేకే వేణుగోపాల్ వాదించారు. అయితే న్యాయమూర్తి జస్టిస్ కె ఎం జోసెఫ్ జూన్ 16వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. అందుకే కేసు విచారణను జులై 11వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జులై 11న వేరే ధర్మాసనం ముందు అమరావతి కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. తను రిటైర్ అవుతున్నందున అమరావతిపై సుదీర్ఘ వాదనలు విని జడ్జిమెంట్ రాసేందుకు సమయం లేదన్న న్యాయమూర్తి కె ఎం జోసెఫ్ అనడంతోనే విచారణ వాయిదా వేసింది.
Next Story