Breaking : సుప్రీంకోర్టు ధర్మాసనం వేర్వేరు అభిప్రాయాలు.. చీఫ్ జస్టిస్ బెంచ్ కు బదిలీ
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వేసిన క్వాష్ పిటీషన్ పై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కు సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్ పై తీర్పు చెప్పింది. స్కిల్ డెెవలెప్ మెంట్ స్కామ్ కేసులో వేసిన క్వాష్ పిటీషన్ పై ప్రతికూలంగా ఒకరు, అనుకూలంగా ఒకరు అభిప్రాయం వ్యక్తం చేశారు. జస్టిన్ అనిరుధ్ బోస్, బేలా త్రేవేది ధర్మాసనం దీనిపై తీర్పు వెలువరించింది. ఈ కేసును విడివిడిగా తీర్పు చదవారు 17 ఎ నిబంధన చంద్రబాబు నాయుడుకు వర్తించదని తెలిపింది. ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వెలువడ్దాయి. రిమాండ్ విధించే అధికారం ట్రయల్ కోర్టుకు ఉందని తెలిపారు జస్టిస్ అనిరుధ్ బోస్. చంద్రబాబుకు 17ఏ వర్తించదని త్రివేది, వర్తిస్తుందని అనిరుధ్ తెలిపారు. భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో చీఫ్ జస్టిస్ బెంచ్ కు ఈ కేసును బదలీ చేశారు. సుప్రీంకోర్టు ధర్మాసనం మరొక బెంచ్ కు ఈ కేసును బదిలీ చేసే అవకాశముంది. దీనిపై మళ్లీ విచారణ జరిగి తీర్పు వెలువడటానికి మరికొంత సమయం పడుతుంది.