Mon Nov 18 2024 08:36:08 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : బెయిల్ రద్దు పిటీషన్ పై విచారణ 28న
సుప్రీంకోర్టులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు పిటీషన్ పై విచారణ జరగనుంది.
సుప్రీంకోర్టులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు పిటీషన్ పై విచారణ జరగనుంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబుకు స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో రెగ్యులర్ బెయిల్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ నెల 28వ తేదీ వరకూ ఆయన మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. ఈ కేసులో సెప్టంబరు 9వ తేదీన అరెస్టయి యాభై రెండు రోజుల పాటు జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
అదే రోజు...
సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటీషన్ ను జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. హైకోర్టు తన పరిధి దాటి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిందని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో విచారణ జరగనుంది. మంగళవారం చంద్రబాబు బెయిల్ పై విచారణ జరగనున్న నేపథ్యంలో మళ్లీ ఉత్కంఠ నెలకొంది. అదే రోజు ఆయన మధ్యంతర బెయిల్ గడువు కూడా ముగియనుంది.
Next Story