Mon Nov 18 2024 16:36:50 GMT+0000 (Coordinated Universal Time)
నేడు సుప్రీంలో సునీత పిటీషన్
నేడు సుప్రీంకోర్టులో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి పిటిషన్‌పై విచారణ జరగనుంది.
నేడు సుప్రీంకోర్టులో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సునీత సవాల్ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ హైకోర్టు ఈ నెల 25వ తేదీ వరకూ అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సునీత తరుపున న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈరోజు కూడా...
మరోవైపు ఈరోజు కూడా కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డిని సీబీఐ అధికారులు విచారణ చేయనున్నారు. ఈ హత్య కేసులో దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంపైనే ప్రధానంగా ప్రశ్నలు వేయనున్నారు. ఈ కేసులో అరెస్టయిన భాస్కర్ రెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డిని కూడా తమ కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఇప్పటి వరకూ ముగ్గురిని వేర్వేరుగా విచారించిన సీబీఐ అధికారులు ఈరోజు కలిపి విచారించే అవకాశముందని తెలుస్తోంది.
Next Story