Mon Nov 18 2024 19:30:47 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : రికార్డు స్థాయిలో స్వామి వారి ఆదాయం
తిరుమలలో ఒక్కరోజులో రికార్డు స్థాయి ఆదాయం స్వామి వారికి లభించింది. ఆదివారం 5.05 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది
తిరుమలలో ఒక్కరోజులో రికార్డు స్థాయి ఆదాయం స్వామి వారికి లభించింది. ఆదివారం 5.05 కోట్ల రూపాయలు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈ నెల 23వ తేదీ నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. జనవరి 1వ తేదీ వరకూ ఈ వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతున్నాయి. దీంతో నేడు స్వామి గరుడ సేవను రద్దు చేశారు. పౌర్ణమి సందర్భంగా నిర్వహించాల్సిన గరుడ సేవను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది.
నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం...
నేడు తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరగనుంది. ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 10గంటలకు జరగనున్న సమావేశంలో అభివృద్ధి అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి బోర్డు సభ్యులు హాజరుకానున్నారు. కాగా ఈ నెల 23 నుంచి 2024 జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన సర్వ దర్శనం టోకెన్ల జారీని టీటీడీ పూర్తి చేసింది. తదుపరి సర్వదర్శనం టోకెన్లు జనవరి 2 నుంచి ఇవ్వనున్నారు.
Next Story