Mon Dec 23 2024 10:31:09 GMT+0000 (Coordinated Universal Time)
స్విగ్గీకి షాకిచ్చిన బెజవాడ హోటల్స్ అసోసియేషన్
విజయవాడలో స్విగ్గీని హోటల్స్ యాజమాన్యం నిషేధించింది
విజయవాడలో స్విగ్గీని హోటల్స్ యాజమాన్యం నిషేధించింది. స్విగ్గీ యాజమాన్యం నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నందున ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో హోటల్, రెస్టారెంట్ల నిర్వాహకులందరూ కలసి స్విగ్గీ ఆర్డర్లను తీసుకోకూడదని నిర్ణయించారు. హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్.వి.స్వామి, కమిటీ కన్వీనర్ రమణారావు మాట్లాడుతూ స్విగ్గీ యాజమాన్యం కస్టమర్ల నుంచి వసూలు చేసిన డబ్బులు తమకు సకాలంలో చెల్లించడం లేదని ఆరోపించారు.
ఈనెల 14 నుంచి...
ఈనెల 14 నుంచి రాష్ట్రంలోని హోటల్స్, రెస్టారెంట్లలో స్విగ్గీకి అమ్మకాలు నిలివేశామని వారు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని హోటల్స్ లో స్విగ్గీని బాయ్ కాట్ చేస్తున్నామని తెలిపారు. స్విగ్గీ, జుమాటో వల్ల హోటల్స్, రెస్టారెంట్లకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఆగష్టు 12, 27, సెప్టెంబర్ 27న ముడు దఫాలుగా స్వీగ్గీ, జుమాటో ప్రతినిధులతో చర్చించామని, తమ అభ్యంతరాలను జుమాటో కొంతవరకు అంగీకరించిందని, కానీ స్వీగ్గీ కాలయాపన చేస్తూ వస్తుందని వారు తెలిపారు.
Next Story