Mon Dec 23 2024 10:51:53 GMT+0000 (Coordinated Universal Time)
ఈడీ ఎదుటకు రెండోరోజు జేసీ
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రెండో రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు
మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రెండో రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. వాహనాల కొనుగోలు కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నిన్న 9 గంటల పాటు ఈడీ అధికారులు జేసీ ప్రభాకర్ రెడ్డిని ప్రశ్నించారు.
బ్యాంక్ స్టేట్మెంట్స్ తో...
అయితే ఈరోజు బ్యాంక్ స్టేట్మెంట్స్ తో ఈడీ అధికారుల ఎదుటకు జేసీ ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. బీఎస్ 4 వాహనాలుగా మార్చారన్న అభియోగాలను ఆయన ఎదుర్కొంటున్నారు. బీఎస్ 3 వాహనాలను ఫోర్జరీ చేసి బీఎస్ 4 వాహనాలుగా మార్చి రిజిస్ట్రేషన్ చేయించారన్న ఆరోపణలున్నాయి. 126 వాహనాలను అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి వాటిని స్క్రాప్ కింద కొనుగోలు చేశారు. నాగాలాండ్ లో కొనుగోలు చేసి వాటిని ఏపీలో ఫేక్ రిజిస్ట్రేషన్ చేయించారన్న ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు. దీనిపై ఈడీ అధికారులు విచారణను రెండో రోజు చేస్తున్నారు.
Next Story