Mon Dec 23 2024 10:39:51 GMT+0000 (Coordinated Universal Time)
కనిపిస్తే కాల్చి పడేస్తా : జేసీ హెచ్చరిక
మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇసుక ట్రాక్టర్లు కనిపిస్తే కాల్చి పడేస్తానని హెచ్చరించారు.
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇసుక ట్రాక్టర్లు కనిపిస్తే కాల్చి పడేస్తానని హెచ్చరించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇక నుంచి అక్రమంగా ఇసుక సరఫరాను ఉపేక్షించేది లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుక తోలితే ఊరుకునేది లేదని చెప్పారు. నియోజకవర్గంలో ఎక్కడ ఇసుక తవ్వకాలు చేపట్టినా ఊరుకోబమని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
ట్రాక్టర్లు, ట్రాలీలు...
అంతే కాదు ట్రాక్టర్లు, ట్రాలీలు యాజమాన్యాన్ని కూడా హెచ్చరించారు. ఇసుకలోడుతో కనిపిస్తే ట్రాక్టర్లను తగులబెడతానని హెచ్చరించారు. ఇక పోలీసులకు కూడా ఫిర్యాదు చేసేది లేదని, ఫిర్యాదులు చేసి చేసి తాము అలసి పోయామని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇసుక, మట్టి తరలింపునకు ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాల్సిందేనని చెప్పారు. అధికారులు కూడా ఒళ్లు దగ్గర పెట్టుకుని విధులు నిర్వహించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.
Next Story