Mon Dec 23 2024 11:08:46 GMT+0000 (Coordinated Universal Time)
కంటతడి పెట్టిన జేసీ
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. నారా లోకేష్ కాలి బొబ్బలు చూసి చలించిపోయారు.
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. నారా లోకేష్ కాలి బొబ్బలు చూసి ఆయన చలించిపోయారు. రెండు రోజుల క్రితమే నారా లోకేష్ పాదయాత్ర తాడిపత్రి నియోజకవర్గంలో జరిగిన సంగతి తెలిసిందే. లోకేష్ ను బస చేసిన ప్రాంతంలో చూసిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కాళ్లకు ఉన్న బొబ్బలను చూసి కంటతడిపెట్టుకున్నారు. ప్రజల కోసం లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.
కేసు నమోదు....
కాగా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు తాడిపత్రిలో లోకేశ్ పాదయాత్ర విజయవంతంపై టీడీపీ సంబరాలు జరుపుకుంది. పోలీసులు వద్దని వారించినా టపాసులు కాల్చి టీడీపీ నేతలు ఆనందంగా గడిపారు. జేసీ ప్రభాకర్‌రెడ్డితోపాటు అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story