Mon Dec 15 2025 03:50:09 GMT+0000 (Coordinated Universal Time)
నేడు టీడీఎల్పీ సమావేశం.. కీలక నిర్ణయం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలను టీడీపీ బహిష్కరించాలని నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఈరోజు ఎమ్మెల్యేల అభిప్రాయాలను చంద్రబాబు తీసుకోనున్నారు.
అధికారిక ప్రకటన...
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రజా వ్యతిరేక విధానాలపై బయట ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించే అవకాశముంది. చంద్రబాబు ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలకు రానని శపథం చేశారు. ఎమ్మెల్యేలు కూడా తాము దూరంగా ఉంటామని చెబుతుండటంతో బడ్జెట్ సమావేశాలను టీడీపీ బహిష్కరించనుంది. టీడీఎల్పీ సమావేశం అయిపోయిన తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు.
Next Story

