Sat Nov 30 2024 16:28:28 GMT+0000 (Coordinated Universal Time)
బెజవాడ కౌన్సిల్ లో రభస
విజయవాడ నగరపాలకసంస్థ కౌన్సిల్ సమావేశాన్ని టీడీపీ, సీపీఎం కార్పొరేటర్లు బహిష్కరించారు.
విజయవాడ నగరపాలకసంస్థ కౌన్సిల్ సమావేశాన్ని టీడీపీ, సీపీఎం కార్పొరేటర్లు బహిష్కరించారు. తమ హక్కులను అధికార వైసీపీ కాలరాస్తుందని వారు ఆరోపించారు. తాము ఇచ్చిన ప్రశ్నలను పరిగణనలోకి తీసుకోకుండా, ముఖ్యమైన సమస్యలను చర్చించకుండా కౌన్సిల్ ను కొనసాగించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ, సీపీఎం సభ్యుల బైఠాయింపు....
చట్ట ప్రకారం కాకుండా వైసీీపీ రాజ్యాంగం ప్రకారమే కౌన్సిల్ ను నిర్వహించడమేంటని టీడీపీ, సీపీఎం కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నరాు. అధికారులు కూడా అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని అన్నారు. తాము సమస్యలపై ప్రశ్నిస్తుంటే ఎదురుదాడికి దిగుతున్నారని ఆరోపించారు. టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వకుండా కాలక్షేపం చేస్తున్నారని వారు చెబుతున్నారు. కౌన్సిల్ సమావేశానికి మీడియాను కూడా అనుమతించకుండా తమ గొంతునొక్కే ప్రయత్నిస్తుందని వారు కౌన్సిల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు.
Next Story