Mon Dec 23 2024 14:18:12 GMT+0000 (Coordinated Universal Time)
Tdp, janasena : నేడు తొలిసారి భేటీ
తెలుగుదేశం, జనసేన పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నేడు రాజమండ్రిలో జరగనుంది.
తెలుగుదేశం, జనసేన పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నేడు రాజమండ్రిలో జరగనుంది. తొలిసారి జరగనున్న ఈ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ల అధ్యక్షతన మధ్య ఈ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు పవన్ కల్యాణ్ రాజమండ్రి చేరుకోనున్నారు.
భవిష్యత్ కార్యాచరణపై...
తొలిసారి జరిగే ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశముంది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా సంయుక్తంగా కార్యచరణ ప్లాన్ చేయనున్నారు. రానున్న కాలంలో ఏ ఏ కార్యక్రమాలు చేపట్టాలి? అన్న దానిపై ఈ సమావేశంలో స్పష్టత రానుంది. టీడీపీ తరుపున అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పితాని సత్యనారాయణ, పయ్యావుల కేశవ్, తంగిరాల సౌమ్య, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, పాలవలస యశస్వి బొమ్మిడి నాయకర్, మహేందర్ రెడ్డి, కొటికలపూడి గోవిందరావులు హాజరు కానున్నారు.
Next Story