Sat Mar 22 2025 19:55:51 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో ఉమ్మడి సభ
ఈనెల 28వ తేదీన తాడేపల్లిగూడెంలో ఉమ్మడిగా బహిరంగ సభ నిర్వహించాలని టీడీపీ, జనసేనలు నిర్ణయించాయి

ఈనెల 28వ తేదీన తాడేపల్లిగూడెంలో ఉమ్మడిగా బహిరంగ సభ నిర్వహించాలని టీడీపీ, జనసేనలు నిర్ణయించాయి. టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. ఉమ్మడి సభకు చంద్రబాబు, పవన్ కల్యాణ్లు హాజరవుతారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా జనసమీకరణకు ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలిపారు. అలాగే ఉమ్మడి మ్యానిఫేస్టో రూపకల్పనకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించామని ఆయన తెలిపారు.
ఉమ్మడి మ్యానిఫేస్టో...
తాడేపల్లి సభలో రెండు పార్టీల అగ్రనేతలు కీలక ప్రకటనలు చేేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు గ్రామస్థాయిలో కలసి కట్టుగా పనిచేసేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఈ జగన్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు రెండు పార్టీల మధ్య సమన్వయం సాగే దిశగా ఈ సమావేశం జరిగిందన్నారు. రైతు రుణ మాఫీ, డ్వాక్రా రుణ మాఫీ పై కూడా ఈ సమావేశంలో చర్చించామని తెలిపారు.
Next Story