Sun Dec 22 2024 13:24:29 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : రేపు ఒంగోలు.. వరస పర్యటనలతో లోకేష్
రేపటి నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయనున్నారు.
రేపటి నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయనున్నారు. ఇప్పటి వరకూ తాను పోటీ చేసే మంగళగిరి నియోకజకవర్గంలో ప్రచారం నిర్వహించిన లోకేష్ ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ప్రధానంగా యువతతో ఆయన సమావేశాలు నిర్వహించి ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపు అవసరాన్ని వివరించనున్నారు.
యువతతో సమావేశాలు...
రేపు ఒంగోలు నుంచి పర్యటనను నారా లోకేష్ ప్రారంభించనున్నారు. మే 1వ తేదీన నెల్లూరు, 2వ తేదీన రాజంపేట, మే 3న కర్నూలు లోక్సభ నియోజకవర్గంలో, 4న నంద్యాల లోక్ సభ నియోజకవర్గంలో పర్యటిస్తారు. మే 5న చిత్తూరు, మే 6న ఏలూరు లోక్సభ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. యువతతో సమావేశాలతో పాటుగా వివిధ ప్రాంతాల్లో లోకేష్ రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రతి రోజూ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకూ యువతతో ముఖాముఖి సమావేశాలను నిర్వహించనున్నారు.
Next Story