Mon Dec 23 2024 13:30:47 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : కుప్పం టీడీపీ నేతలపై కేసులు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందని కుప్పం టీడీపీ శ్రేణులు ఘనంగా సంబరాలు జరుపుకున్నాయి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందని కుప్పం టీడీపీ శ్రేణులు ఘనంగా సంబరాలు జరుపుకున్నాయి.అయితే ర్యాలీలకు అనుమతులు లేదంటూ, ఎన్నికల నిబంధన ఉల్లంఘించారని టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌తో పాటు 29 మంది టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు.
సంబరాలు జరుపుకున్నారని...
అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని టీడీప నేతలు చెబుతున్నారు. కుప్పం మున్సిపల్ కమిషనర్ రవిరెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు గ్రాడ్యుయేట్ స్థానాల్లో టీడీపీ విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు ప్రతి చోట సంబరాలు జరుపుకుంటున్నాయి.
Next Story