Sun Dec 22 2024 13:08:29 GMT+0000 (Coordinated Universal Time)
మాగుంట ఫ్యామిలీకే మినహాయింపు.. మిగిలిన వాళ్లకు నో ఛాన్స్
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు వార్నింగ్ ఇచ్చారు
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు వార్నింగ్ ఇచ్చారు. లిక్కర్ వ్యాపారంలో ఎవరైనా వేలు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఒక్క మాగుంట కుటుంబానికి మాత్రం మినహాయింపు ఉందని సమావేశంలో తెలిపారు. మాగుంట కుటుంబం ఎప్పటి నుంచో మద్యం వ్యాపారంలో ఉంది కనుక వారిని మినహాయిస్తే కొత్తవారు ఈ వ్యాపారంలోకి ప్రవేశించాలనుకున్న వారిని ఊరుకునేది లేదని చంద్రబాబు సీిరియస్ గా తెలిపారు.
డబ్బులున్నంత మాత్రాన...
డబ్బులు ఉన్నంత మాత్రాన గెలవరని, మొన్నటి ఎన్నికల్లో డబ్బు సంచులున్నప్పటికీ వైసీపీ పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమయిందని గుర్తు చేశారు. లిక్కర్, ఇసుక వ్యాపారాల్లో తలదూరిస్తే ఒప్పుకునేది లేదని ఆయన చెప్పారు. ప్రజలు కూడా క్షమించరని అన్నారు. 2029 ఎన్నికల్లో తిరిగి గెలవాలంటే చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. టీడీపీ ఓడిపోయిన, పోటీ చేయిన నియోజకవర్గాల్లో కూడా పార్టీ బలోపేతానికి కూడా కృషి చేయాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. ఎవరు తప్పు చేసినా అది ప్రభుత్వంపై ఉందని తెలిపారు.
Next Story