Mon Dec 23 2024 12:17:27 GMT+0000 (Coordinated Universal Time)
పేరు మారిస్తే ఊరుకునేది లేదు.. బాబు వార్నింగ్
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎలా మారుస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎలా మారుస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. పేరు మార్పుపై చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 1986లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రారంభమయిందన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ యూనివర్సిటీతో వైఎస్ కు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించాల్సిందేనని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ పెట్టిన యూనివర్సిటీని....
వైఎస్సార్ ఆ యూనివర్సిటీని ఏర్పాటు చేసి ఉంటే పేరు పెట్టడానికి ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలని ఎన్టీఆర్ భావించారని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ మరణం తర్వాత హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టామన్నారు. పేర్లు మార్చినంత మాత్రాన మీకు మీరు రాదని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ పేరు మారిస్తే ఆందోళన తీవ్రతరం చేస్తామని చంద్రబాబు హెచ్చరించారు.
Next Story