Mon Dec 23 2024 13:18:05 GMT+0000 (Coordinated Universal Time)
ముఖ్యమంత్రి అయిన నెలరోజుల్లోనే?
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు. తాను ముఖ్యమంత్రి అయిన నెలరోజుల్లో అన్ని ఇళ్లకు పట్టాలు ఇస్తానని చెప్పారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు. తాను ముఖ్యమంత్రి అయిన నెలరోజుల్లో అన్ని ఇళ్లకు పట్టాలు ఇస్తానని చెప్పారు. ఒక్కొక్క ఇంటికి పదివేలు ఎందుకు కట్టాలని చంద్రబాబు ప్రశ్నించారు. ఎప్పుడో కట్టిన ఇళ్లకు ఇప్పుడు ఇళ్ల పట్టాలేంటని చంద్రబాబు నిలదీశారు. ఖజానా నింపుకునేందకు జగన్ కొత్త ప్రయత్నం చేస్తుందని చంద్రబాబు అన్నారు. ఉచితంగా ఇళ్లను పంపిణీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని చంద్రబాబు అన్నారు.
ఆ ఎన్నికల్లో.....
ఇక గురజాల, దాచేపల్లిలో నైతికంగా గెలుపు టీడీపీదేనని చంద్రబాబు అన్నారు. గురజాల, దాచేపల్లి మున్సిపల్ ఎన్నికలపై చంద్రబాబు సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారదర్శకంగా ఎన్నికలు జరిగి ఉంటే గురజాత, దాచేపల్లిలో టీడీపీ విజయం సాధించి ఉండేదన్నారు. ఎనిమిది మంది టీడీపీ కార్యకర్తల హత్యలకు జగన్ సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
- Tags
- chandra babu
- tdp
Next Story