Chandrababu : జైలు నుంచి వచ్చిన తర్వాత తొలి మాటలు ఇవే
టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చారు.
టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఉదయం స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. దీంతో చంద్రబాబు బెయిల్ కు సంబంధించిన కోర్టు ఉత్తర్వులను జైలు అధికారులకు చేర్చారు. వెంటనే బెయిల్ ఉత్తర్వుల్లో ఆదేశాలను జైలు అధికారులకు ఆయనకు చదవి వినిపించారు.
రాజమండ్రి నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా గన్నవరం విమానాశ్రయానికి చంద్రబాబుకు చేరుకోనున్నారు. నారా భువనేశ్వరి రాక కోసం చంద్రబాబు ఎదురు చూస్తున్నారు. ఆమె విజయనగరం జిల్లా పర్యటనకు వెళ్లడంతో మరికొద్ది నిమిషాల్లో చంద్రబాబు కాన్వాయ్ బయలుదేరి రోడ్డు మార్గాన గన్నవరం చేరుకుంటుంది. అక్కడి నుంచి హైదరాబాద్ కు వెళ్లిన చంద్రబాబు ఏఎంజీ ఆసుపత్రిలో అడ్మిట్ అయి కంటికి సంబంధించిన ఆపరేషన్ చేయించుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అందరికీ ధన్యవాదాలంటూ...
రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారాలు. తాను కష్టంలో ఉన్నప్పుడు యాభై రెెండు రోజులగా తన కోసం రోడ్డు మీదకు వచ్చి సంఘీభావం తెలియజేశారు. పూజలు చేశారు. మీరు చూపిన అభిమానాన్నిజీవితంలో ఎప్పుడూ మరచిపోనని, రెండు తెలుగు రాష్ట్రాల్లో చూపిన అభిమానం తాను మరిచిపోలేనని తెలిపారు. తాను చేసిన అభివృద్ధిని కూడా మీరు చూపారు. తన జన్మధన్యమైందని అన్నారు. నలభై మూడు సంవత్సరాల తన రాజకీయ జీవితంలో తాను ఎప్పుడూ తప్పు చేయలేదని, చేయనని కూడా ఆయన అన్నారు. అన్ని రాజకీయ పార్టీలూ తనకు సంఘీభావం తెలిపాయని అన్నారు. వాటికి ధన్యవాదాలు అని చెప్పారు. అందరూ తనకు మనో ధైర్యాన్ని ఇచ్చారని అన్నారు. ప్రత్యేకంగా జనసేన అధినేత పవన్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్ వంటి నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.