Mon Dec 23 2024 08:15:21 GMT+0000 (Coordinated Universal Time)
బాబు సీరియస్.. సీనియర్ నేతపై దాడి ఘటన?
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తిక్కారెడ్డిపై వైసీపీ నేతల దాడిని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఖండించారు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తిక్కారెడ్డిపై వైసీపీ నేతల దాడిని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఖండించారు. వైసీపీ అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయందన్నారు. నిన్న తిక్కారెడ్డి కోస్గి మండలం పెద్ద భూంపల్లిలో రధోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పై దాడి చేశారు. ఈ దాడిలో తిక్కారెడ్డితో పాటు ఐదుగురు టీడీపీ కార్యకర్తలు గాయాలపాలయ్యారు. వీరిందరినీ స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు.
పోలీసులున్నారా?
అసలు ఏపీలో పోలీసులు ఉన్నారా? లేదా? చట్టం అమలవుతుందా? లేదా? అన్న అనుమానం కలుగుతుందని చంద్రబాబు అన్నారు. తిక్కారెడ్డిపై హత్యాయత్నం జరిగినా పోలీసులు పట్టించుకోకపోవడం విచారకరమని అన్నారు. ఇప్పటికే రెండుసార్లు తిక్కారెడ్డిపై హత్యాయత్నం జరిగినా పోలీసులు భద్రత కల్పించడంలో విఫలమయ్యారని చంద్రబాబు ఫైర్ అయ్యారు.
Next Story