Mon Dec 23 2024 18:34:38 GMT+0000 (Coordinated Universal Time)
ఆవేశంతో ఊగిపోయిన చంద్రబాబు
కుప్పం నియోజకవర్గంలో తన పర్యటనను అడ్డుకోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుప్పం నియోజకవర్గంలో తన పర్యటనను అడ్డుకోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ చట్టం ప్రకారం తనను ఆపారని అన్నారు. తన వాహనాన్ని ఎందుకు ఆపారు? అని ప్రశ్నించారు. జీవోను నోటిఫై చేయలేదని చంద్రబాబు అన్నారు. 1861 బ్రిటీష్ యాక్ట్ లో కూడా ఇలా లేదని, బ్రిటీష్ వాళ్ల కంటే వైసీపీ వాళ్లు ఘోరంగా తయారయ్యారన్నారు. రాజకీయాలంటే పిల్లచేష్టలా జగన్ రెడ్డీ అని ప్రశ్నించారు. ఇప్పుడు ఏం చేయాలని చంద్రబాబు ప్రజలను ప్రశ్నించారు.
లేకుంటే ధర్నా చేస్తా...
నేను గ్రామంలోకి వెళ్లి రెడీ అయి వస్తానని, అప్పటికి పోలీసులు తన వాహనాన్ని తెప్పించాలని చంద్రబాబు అన్నారు. నలభై ఏళ్లలో తనను ఎవరూ ఇలా ఇబ్బంది పెట్టలేదని, తమను అణిచివేయాలని చూస్తే మరింత రెచ్చిపోతానని, అప్పటికీ మైకు ఇవ్వకపోతే అక్కడే తాను ధర్నాకు దిగుతానని చంద్రబాబు తెలిపారు. తర్వాత చంద్రబాబు గ్రామంలోకి వెళ్లి ఇంటింటికి తిరుగుతూ ప్రజల నుంచి సమస్యలను స్వీకరించారు. రోడ్ షోకు పర్మిషన్ లేకపోవడంతో పాదయాత్రగా చంద్రబాబు బయలుదేరి వెళ్లారు.
Next Story