Mon Dec 23 2024 07:40:45 GMT+0000 (Coordinated Universal Time)
మరో పథ్నాలుగు రోజుల రిమాండ్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రిమాండ్ పొడిగించారు. ఈ నెల 19వ తేదీ వరకూ రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రిమాండ్ పొడిగించారు. ఈ నెల 19వ తేదీ వరకూ రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు రెండో దఫా విధించిన రిమాండ్ ముగియడంతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి మరోసారి రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీ తరుపున న్యాయవాదులు రిమాండ్ పొడిగించాలంటూ పిటీషన్ దాఖలు చేశారు.
వర్చువల్ గా...
చంద్రబాబు రిమాండ్ ముగియడంతో ఆయనను జైలు అధికారులు వర్చుకవల్ గా జడ్జి ఎదుట హాజరు పర్చారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం రిమాండ్‌ను పొడిగించింది. మరో వైపు ఫైబర్ నెట్ చంద్రబాబు బెయిల్ పై తీర్పు రిజర్వ్ చేశారు. ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటీషన్లపై వాదనలు విన్న న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.
Next Story