Wed Nov 27 2024 07:53:38 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : చంద్రబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ
టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది
టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఏసీబీ కోర్టు బెయిల్ పిటీషన్ కొట్టి వేయడంతో చంద్రబాబు తరుపున న్యాయవాదులు హైకోర్టులో లంచ్మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. ఏసీబీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆయన ఆశ్రయించారు.
బెయిల్ పిటీషన్ను...
అయితే ఈ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. గత నెల9న చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు ఆయనను విచారించిన పిదప న్యాయస్థానం ఎదుట హాజరు పర్చారు. గత నెల పదో తేదీ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో బెయిల్ పిటీషన్ ను హైకోర్టు కూడా కొట్టివేయడంతో ఇక సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని చంద్రబాబు తరుపున న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.
Next Story