Tue Dec 24 2024 02:44:35 GMT+0000 (Coordinated Universal Time)
జనసేనతో చర్చలకు టీడీపీ కమిటీ
టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన పార్టీతో సమన్వయం కోసం కమిటీని ఏర్పాటు చేశారు
టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన పార్టీతో సమన్వయం కోసం కమిటీని ఏర్పాటు చేశారు. ఆయన సూచనల మేరకు అచ్చెన్నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు. టీడీపీ, జనసేన పొత్తు ఖరారయిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించేందుకు రెండు పార్టీలు సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఐదుగురు సభ్యులతో...
అయితే దీనిపై ఇప్పటికే జనసేన ఐదు గురు సభ్యులతో కమిటీని నియమించింది. దీనికి నాదెండ్ల మనోహర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. టీడీపీ నియమించిన కమిటీలో సభ్యులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో ఈకమిటీని ఏర్పాటు చేశారు. రెండు కమిటీలు సమన్వయంతో ఆందోళనలతో పాటు భవిష్యత్ కార్యక్రమాలను నిర్ణయిస్తాయని పార్టీ వర్గాలు చెప్పాయి.
Next Story