Tue Dec 24 2024 00:50:01 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : హైకోర్టులో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్
టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో రిలీఫ్ లభించింది. బెయిల్ పిటీషన్లపై నేడు హైకోర్టు తీర్పు వెలువరించింది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో రిలీఫ్ లభించింది. బెయిల్ పిటీషన్లపై నేడు హైకోర్టు తీర్పు వెలువరించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఇసుక కుంభకోణం, లిక్కర్ స్కాంకు సంబంధించి కేసుల్లో చంద్రబాబు నాయుడుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. లిక్కర్ కేసులో కొల్లు రవీంద్రకు కూడా బెయిల్ మంజూరయింి.
మూడు కేసుల్లోనూ...
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ, ఇసుక కుంభకోణం, లిక్కర్ స్కాంకు సంబంధించి సీఐడీ చంద్రబాబుపై కేసులు నమోదు చేసింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇరువర్గాల వాదనలను విన్న హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది. అన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ లభించడంతో చంద్రబాబుకు గ్రేట్ రిలీఫ్ లభించినట్లయింది.
Next Story