Sat Jan 11 2025 08:42:58 GMT+0000 (Coordinated Universal Time)
హైకోర్టులో నేడు చంద్రబాబు బెయిల్ పిటీషన్
స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు
స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈరోజు విచారణ జరగనుంది. నిన్న ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లో మందస్తు బెయిల్ పై అనుకూల తీర్పు రావడంతో స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు పిటీషన్ దాఖలు చేశారు. జస్టిస్ కె. సురేశ్‌రెడ్డి ఈ పిటీషన్ పై నేడు విచారణ జరపనున్నారు. ఈ కేసులో ఏసీబీ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
విచారణకు...
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు గత నెల రోజుల పైగానే రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్న సంగతి తెలిసిందే. రేపు సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి క్వాష్ పిటీషన్ పై కూడా విచారణ జరగనుంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు తనకు బెయిల్ ఇవ్వాలంటూ కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు. తన అరెస్ట్ అక్రమమని ఆయన పిటీషన్లో పేరకొన్నారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, కోర్టు విధించే అన్ని షరతులకు కట్టుబడి ఉంటానని ఆయన తన పిటీషన్లో పేర్కొన్నారు. దీనిపై నేడు ఎలాంటి తీర్పు వస్తుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
Next Story