Mon Dec 23 2024 13:46:25 GMT+0000 (Coordinated Universal Time)
ర్యాలీకి రెడీ అవుతున్న బాబు
కుప్పంలో చంద్రబాబు ర్యాలీ చేయడానికి రెడీ అయ్యారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి బస్టాండ్ వరకూ ర్యాలీ నిర్వహించనున్నారు
కుప్పంలో ఉన్న చంద్రబాబు ర్యాలీ చేయడానికి రెడీ అయ్యారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి కుప్పం బస్టాండ్ వరకూ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయింంచారు. నిన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై లాఠీఛార్జిని నిరసిస్తూ ఈ ర్యాలీని నిర్వహించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే పోలీసులు ఎటువంటి రోడ్ షోలకు, రహదారులపై సమావేశాలకు అనుమతి లేదని చెప్పారు. పోలీసు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ర్యాలీని నిర్వహించాలని టీడీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.
నిరసనగా...
నిన్న కుప్పంలో జరిగిన ఘటనపై రాళ్లబుదుగురు పోలీస్ స్టేషన్ లో పది మంది కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిసింది. తమను కొట్టి తమపైనే కేసులు పెట్టడమేంటని టీడీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. కేసులకు తాము భయపడేది లేదని చెబుతున్నారు.
క్లస్టర్ ఇన్‌ఛార్జులతో...
మరో వైపు కుప్పం, రామకుప్పం, గుడుపల్లి, శాంతిపురం మండలాల క్లస్టర్ ఇన్‌ఛార్జులతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం కానున్నారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు అధికార పార్టీని ఎలా ఎదుర్కొనాలన్న దానిపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. కుప్పంలోని ఎంఎం, కేవీఆర్ కల్యాణమండపాలను ఇందుకు సిద్ధం చేశారు. పెద్దయెత్తున కార్యకర్తలు కళ్యాణ మండపాల వద్దకు చేరుకుంటున్నారు.
Next Story