Sun Dec 22 2024 12:04:06 GMT+0000 (Coordinated Universal Time)
నేడు పెద్దాపురంలో చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. జగ్గంపేటలో నేడు నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. జగ్గంపేటలో నేడు కీలక నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు చర్చించనున్నారు. నిన్న జగ్గంపేటలో జరిగిన రోడ్ షో విజయవంతం కావడంతో పార్టీ నేతల్లో ఉత్సాహం పెరిగింది. జగన్ పాలనను తరిమికొట్టాలని చంద్రబాబు ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు.
బహిరంగ సభలో...
ఈరోజు సాయంత్రం పెద్దాపురంలో జరిగే రోడ్ షోలో చంద్రబాబు పాల్గొంటారు. ఈ సందర్బంగా మహాసేన రాజేష్ పార్టీలో చేరనున్నారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. చంద్రబాబు పర్యటన కోసం పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బహిరంగ సభకు అధిక సంఖ్యలో జనసమీకరణకు తెలుగుదేశం పార్టీ జిల్లా నేతలు ప్రయత్నిస్తున్నారు.
Next Story