Mon Dec 23 2024 16:26:35 GMT+0000 (Coordinated Universal Time)
కేశినేనికి బాబు కీలక బాధ్యతలు
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎంపీ కేశినేని నానికి అప్పగించారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎంపీ కేశినేని నానికి అప్పగించారు. ఇది అందరూ ఊహించిందే. బలహీనంగా ఉన్న టీడీపీని కేశినేని బలోపేతం చేస్తారని చంద్రబాబు భావించారు. అయితే ఇక్కడ ఇన్ ఛార్జిపైస ఎన్నో ఆశలు పెట్టుకున్న బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలకు ఇది నిరాశకల్గించే విషయమే. వీరిద్దరూ కేశినేని నానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా చంద్రబాబు మాత్రం కేశినేని నానికి ఇవ్వడం చర్చనీయాంశమైంది.
బెజవాడ వెస్ట్.....
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకూ పార్టీని నాగుల్ మీరా, బుద్దా వెంకన్నలే చూసుకున్నారు. మొన్న కార్పొరేషన్ ఎన్నికల తర్వాత కేశినేని నాని తో వీరి విభేదాలు మరింత ముదిరాయి. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ యాక్టివ్ అయ్యారు. దీంతో కేశినేని నానికి చంద్రబాబు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించడంతో టీడీపీ నగర నేతల్లో అసంతృప్తి పెరిగిందంటున్నారు.
Next Story