Mon Nov 18 2024 18:38:35 GMT+0000 (Coordinated Universal Time)
Tdp, Janasena : పవన్, బాబు భేటీలో నిర్ణయించిన సీట్లు ఇవే
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపారు. నిన్న ఒక్కరోజే రెండుసార్లు సమావేశమై సీట్లను ఖరారు చేసుకున్నారు. త్వరలోనే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించే అవకాశాలున్నాయి. ఇద్దరు నేతలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. తొలి సభ పాలకొల్లులో నిర్వహించాలని ప్రాధమికంగా నిర్ణయించినట్లు తెలిసింది.
మరోసారి 8న...
ఈ నెల 8వ తేదీన మరోసారి సమావేశమై సీట్ల సర్దుబాటుపై ఫైనల్ డెసిషన్ కు వస్తారని తెలిసింది. ఉమ్మడి సమావేశాల నిర్వహణతో పాటు ఉమ్మడి మ్యానిఫేస్టోపై కూడా ఇద్దరు నేతలు చర్చించారు. పొత్తులలో సీట్లు కోల్పోయిన పార్టీ నేతలను సముదాయించేందుకు ప్రత్యేకంగా వారితో సమావేశమై తాము ఏ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో వివరించనున్నారు.
స్థానాలవే...
ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలను, మూడు పార్లమెంటు స్థానాలను జనసేనకు అప్పగించేందుకు టీడీపీ అధినేత నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకు పవన్ కల్యాణ్ కూడా సముఖంగానే ఉన్నట్లు చెబుతున్నారు. సీట్ల సంఖ్య కంటే గెలిచే సీట్లు ఎన్ని అన్నవే ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించడానికి ఇదే కారణమని చెబుతున్నారు. ప్రధానంగా పార్లమెంటు స్థానాల్లో మాత్రం క్లారిటీ వచ్చింది. మచిలీపట్నం, కాకినాడ, అనకాపల్లి పార్లమెంటు స్థానాలను జనసేనకు ఇచ్చేందుకు టీడీపీ అధినేత అంగీకరించినట్లు సమాచారం.
Next Story