Sun Dec 22 2024 22:33:09 GMT+0000 (Coordinated Universal Time)
TDP : నేడు నెల్లూరుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు ఉమ్మడి ప్రచారం నిర్వహించనున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు ఉమ్మడి ప్రచారం నిర్వహించనున్నారు. నెల్లూరు జిల్లాలో ఇద్దరూ కలసి పర్యటించనున్నారు. నెల్లూరు లో జరిగే రోడ్ షోలో పవన్, చంద్రబాబు పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. నెల్లూరులోని కేవీఆర్ సెంటర్ నుంచి నర్తకి సెంటర్ వరకూ రోడ్ షఓ నిర్వహిస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
ఉమ్మడి సభలకు...
ఇద్దరు నేతలు కలసి వరసగా ఉమ్మడి సభల్లో ప్రసంగిస్తూ రెండు పార్టీలకు చెందిన ఓట్ల బదిలీకి క్యాడర్ ను సమాయత్తం చేస్తూ వెళుతున్నారు. ఇద్దరి సభలకు పెద్దయెత్తున ప్రజలు తరలి రావడంతో పాటుగా ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఈరోజు సాయంత్రం నెల్లూరు జిల్లాలో జరిగే బహిరంగ సభ, రోడ్ షోలలో చంద్రబాబు, పవన్ పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇద్దరు పాల్గొనే సభ కోసం నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు.
Next Story